సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోం మంత్రి అనిత
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:58 AM
సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అప్పన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anitha) ఈరోజు (ఆదివారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అప్పన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో హోం మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని అనిత దర్శించుకున్నారు. దర్శనం అనంతరం హోం మంత్రికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అనితకు అందజేశారు. అలాగే, అప్పన్న స్వామి సన్నిధిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్న స్వామి ఆశీస్సులను హోం మంత్రి అనిత పొందారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు
క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా
ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News