Share News

పోలీస్ వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ABN , Publish Date - May 19 , 2026 | 07:42 PM

ప్రజలకు చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీసుస్టేషన్‌లను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు.

పోలీస్ వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
AP DGP Harish Kumar Gupta

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీసుస్టేషన్‌లను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) కంచరపాలెం ట్రాఫిక్, ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్, ఎయిర్ పోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


విశాఖ ట్రాఫిక్ వింగ్ కోసం ప్రత్యేక ఐపీఎస్ అధికారిని నియమిస్తామని డీజీపీ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ స్టేషన్‌లోనే సైబర్ క్రైమ్ స్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. కోస్టల్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. కోస్టల్ సెక్యూరిటీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కోస్టల్ ప్రాంతంలో 21 పోలీసుస్టేషన్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రజా భద్రత, మహిళల రక్షణే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మహిళలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొవాలని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్

భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 19 , 2026 | 07:45 PM