ఉద్యోగం పేరుతో వైసీపీ మాజీ కౌన్సిలర్ ఘరానా మోసం
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:33 PM
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.50 వేల నగదు, 35 గ్రాముల బంగారం తీసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. వైసీపీ మాజీ కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరిపై చర్యలు తీసుకుని తమ నగదు, బంగారం తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు.
అనకాపల్లి జిల్లా, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో ఉద్యోగం పేరుతో వైసీపీ మాజీ కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఎమ్మార్వో ఆఫీసులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.50 వేలు నగదు, 35 గ్రాముల బంగారం స్వాహా చేశారు. బాధితులు గొర్లి రాజుబాబు, శైలజ దంపతుల ఫిర్యాదుతో నర్సీపట్నం టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
డబ్బులు, బంగారం తిరిగి ఇవ్వాలని తాము నిలదీయగా అభ్యంతరకరంగా దూషించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై న్యాయం చేయాలంటూ నర్సీపట్నం టౌన్ సీఐకి విన్నవించారు. తమ నగదు, బంగారాన్ని తిరిగి ఇప్పించి, జగదీశ్వరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News