Share News

అనకాపల్లి జిల్లాలో విద్యుదాఘాతం.. ఇద్దరు మహిళల మృతి

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:00 AM

అనకాపల్లి జిల్లా నాతవరంలోని గొల్లవీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాకుకు గురై ఇద్దరు మహిళలు మృతిచెందారు.

అనకాపల్లి జిల్లాలో విద్యుదాఘాతం.. ఇద్దరు మహిళల మృతి
Anakapalli Electric Shock Tragedy

అనకాపల్లి జిల్లా , సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నాతవరంలోని గొల్లవీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాకుకు గురై ఇద్దరు మహిళలు మృతిచెందారు. వీరిలో గొంప మంగ (55), రొంగల జానకి (28) మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.


ఈ ఘటనపై అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయ్ దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయ్, ఎంపీ సీఎం రమేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడిని అయ్యన్న సతీమణి పద్మావతి పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.


బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటాం: ఎంపీ రమేశ్

అనకాపల్లి జిల్లాలో జరిగిన విద్యుదాఘాతం ఘటనపై ఎంపీ సీఎం రమేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తన తరఫున, ప్రభుత్వం తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని ఎంపీ రమేశ్ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ

తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 10:40 AM