Share News

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి

ABN , Publish Date - Nov 21 , 2026 | 07:08 AM

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రకాశం జిల్లాలో  ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
Prakasam District Road Accident

ప్రకాశం జిల్లా, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెళ్లూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు (శనివారం) ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బాపట్లకు AP 40 LH 5055 నంబరు గల మారుతి సుజుకి ఎర్టిగా కారులో ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఫేస్ కాలేజ్ దాటిన అనంతరం డ్రైవర్ ప్రవీణ్ నిద్రమత్తులో ఉండటంతో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు గోడను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది.


ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బాపట్లకు చెందిన డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి మృతిచెందారు. నూతన దంపతులు శ్రీతేజ, కైవల్యలకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్

పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 08:10 AM