Share News

కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేస్తున్నాం: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:27 AM

సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయంగా చ‌ర్య‌లు చేప‌ట్టిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేస్తున్నాం: మంత్రి గొట్టిపాటి
AP Minister Gottipati Ravi Kumar

ప్రకాశం జిల్లా, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయంగా చ‌ర్య‌లు చేప‌ట్టిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Gottipati Ravi Kumar) వ్యాఖ్యానించారు. ఈరోజు (శనివారం) ఒంగోలులో జ‌రిగిన 5వ బ్యాచ్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంత్రి గొట్టిపాటి పాల్గొని మాట్లాడారు. శిక్ష‌ణ పూర్తి చేసుకుని నూత‌నంగా విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర యువ‌త‌ భ‌విష్య‌త్తే ల‌క్ష్యంగా కూట‌మి ప్ర‌భుత్వం ప‌ని చేస్తోందని స్పష్టం చేశారు.


ఉద్యోగాల క‌ల్ప‌న కోసం కృషి..

ప్ర‌భుత్వ ఉద్యోగాల‌తో పాటు ప్రైవేటు ఉద్యోగాల క‌ల్ప‌న కోసం రాష్ట్రంలో పెట్టుబ‌డులు, బ‌డా సంస్థ‌లు వ‌చ్చేలా తాము కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌టిష్ఠత కోసం సుమారు 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశామని తెలిపారు. కానిస్టేబుళ్ల‌కు స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారని ప్రస్తావించారు. ఇప్ప‌టికే డీఎస్సీ ద్వారా 16,000కుపైగా ఉపాధ్యాయుల‌ను నియ‌మించామని చెప్పుకొచ్చారు. విద్యుత్ శాఖ‌లో సుమారు 600కుపైగా ఏఈ పోస్టుల‌కు సంబంధించి రాత ప‌రీక్ష పూర్త‌య్యిందని తెలిపారు.


శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం..

స‌ర్టిఫికెట్ల త‌నిఖీల అనంత‌రం త్వ‌ర‌లోనే అర్హుల‌కు ఉద్యోగాలు ఇస్తామని మంత్రి గొట్టిపాటి అన్నారు. దాదాపు ఐదు ల‌క్ష‌ల మందికిపైగా ద‌ర‌ఖాస్తుదారుల్లో సుమారు ఆరు వేల మంది అర్హులైన‌ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసి అత్యుత్త‌మ శిక్ష‌ణ ఇచ్చామని తెలిపారు. మారుతున్న నేరాల‌కు అనుగుణంగా పోలీస్ సిబ్బంది కూడా వృత్తిప‌ర‌మైన నైపుణ్యాల‌ను పెంచుకోవాల‌ని సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కానిస్టేబుళ్ల‌కు శిక్ష‌ణ స‌మ‌యంలోనూ ఆర్థిక భ‌రోసా అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. వారి స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,000కు పెంచినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే మా ప్రభుత్వ లక్ష్యం: పెమ్మసాని

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్

పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 12:03 PM