Share News

మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుంది.. వెంకయ్యనాయుడు ప్రశంసలు

ABN , Publish Date - May 02 , 2026 | 01:50 PM

ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరు చాలా బాగుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ ఏడాది పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చారని కొనియాడారు.

మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుంది.. వెంకయ్యనాయుడు ప్రశంసలు
Venkaiah Naidu

నెల్లూరు, మే2 (ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పనితీరు చాలా బాగుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ప్రశంసించారు. ఈ ఏడాది పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చారని కొనియాడారు. మాజీ ప్రధాని వాజ్‌పాయ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో నాలుగుసార్లు కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతి పదవులు స్వీకరించానని ప్రస్తావించారు. తన కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్‌లతో... వారి వ్యాపారాల్లో తాను కలగజేసుకోనని, తన రాజకీయాల్లోకి వారు రావొద్దనే గౌరవ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. మంచి పనులు చేసే వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సాహించాలని వెంకయ్యనాయుడు సూచించారు.


తల్లిదండ్రులు పిల్లలకు సమయాన్ని కేటాయించట్లేదు..

ఈరోజు (శనివారం) నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో ఆయన పర్యటించారు. శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి జీవిత చరిత్ర, విశ్వంభరుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేశ్ రెడ్డి, దీపావెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు పిల్లలకు సమయాన్ని కేటాయించట్లేదని.. మొబైల్, టీవీలకు మాత్రమే సమయాన్ని కేటాయించడం సరికాదని పేర్కొన్నారు.


పత్రికల్లో వచ్చే వార్తలను చూస్తోంటే సిగ్గేస్తోంది..

తిరుమల వేంకటేశ్వరస్వామిని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దర్శించుకోవాలని తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. సమాజం గతితప్పినప్పుడే వారిని సరైన మార్గంలో పెట్టేందుకు దివ్య స్వరూపులైన యోగి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి, పుట్టపర్తి సాయిబాబా, షిర్డీ సాయిబాబా లాంటి అవధూతలు భూమిపైకి వచ్చారని ప్రస్తావించారు. ఏదైనా పని చేయాలంటే మనసులో, కుటుంబంలో, గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కూడా శాంతి ఉండాలని సూచించారు. పాశ్చాత్య వ్యామోహం ఎక్కువై మనదేశంలో కూడా మార్పులు వస్తున్నాయని తెలిపారు. రోజూ పత్రికల్లో వచ్చే వార్తలను చూస్తోంటే సిగ్గేస్తోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్‌కు మానసిక సమస్య ఉంది.. సీఎం సెటైర్లు

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 02 , 2026 | 01:58 PM