పెన్షన్స్‌పై ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుంది: ఎంపీ శివనాథ్
ABN , Publish Date - May 08 , 2026 | 01:40 PM
పెన్షన్స్‌పై తమ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాఖ్యానించారు. ఆయా సమస్యల పరిష్కరానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి): పెన్షన్స్‌పై తమ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Shivanath) వ్యాఖ్యానించారు. ఆయా సమస్యల పరిష్కరానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని చెప్పుకొచ్చారు. తాము హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని ఒక్కొక్కటిగా అమలు చేశామని వెల్లడించారు. ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వమని అంటున్నారని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) విజయవాడలోని 45వ డివిజన్ ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎంపీ శివనాథ్ పాల్గొని మాట్లాడారు. జగన్ హయాంలో నేతలు, అధికారులు ఎవరు ప్రజల దగ్గరకు వెళ్లింది లేదని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సూచనల మేరకు ఈ ప్రజాదర్భార్ కార్యక్రమం జరుగుతుందని ఎంపీ శివనాథ్ వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. విజయవాడలోని అన్ని సమస్యలను జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులం కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఆయా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు. జీవో నంబర్ 30ను తీసుకువచ్చి ప్రతి ఒక్క లబ్దిదారుడుకి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. విజయవాడలో డ్రైనేజీ, కొండ ప్రాంత ప్రజల సమస్యలు త్వరలో పరిష్కారం కాబోతున్నాయని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు
పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు
ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News