Share News

జగన్ హయాంలో అవినీతి ఫుల్.. అభివృద్ధి నిల్: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:26 PM

సీఎం చంద్రబాబు చేతులతో శాశ్వత ఇళ్ల పట్టాలను విజయవాడ నగర వాసులకు ఇవ్వడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాలను చంద్రబాబు పంపిణీ చేయడం జీవితకాలం ప్రజలకు గుర్తు ఉంటుందని పేర్కొన్నారు.

జగన్ హయాంలో అవినీతి ఫుల్.. అభివృద్ధి నిల్:  బుద్దా వెంకన్న
TDP Leader Buddha Venkanna

విజయవాడ, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు చేతులతో శాశ్వత ఇళ్ల పట్టాలను విజయవాడ నగర వాసులకు ఇవ్వడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాలను చంద్రబాబు పంపిణీ చేయడం జీవితకాలం ప్రజలకు గుర్తు ఉంటుందని పేర్కొన్నారు. పేద ప్రజల పక్షానే చంద్రబాబు ఉంటారని వివరించారు. ఈరోజు(బుధవారం) విజయవాడలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు.


ఎన్నికల వరకే చంద్రబాబు రాజకీయం ఉంటుందని.. ఆ తర్వాత అంతా అభివృద్ది గురించి మాత్రమే ఆలోచిస్తారని బుద్దా వెంకన్న తెలిపారు. వైసీపీ నేతలకు సంపద దోచుకోవడం అలవాటని.. చంద్రబాబుకు సంపద సృష్టించటం అలవాటని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో అవినీతి ఫుల్.. అభివృద్ధి నిల్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో రాష్టం అంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచడమే ‘మిషన్‌ కర్మయోగి’ లక్ష్యం: సీఎం చంద్రబాబు

తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 12:37 PM