మెగా డీఎస్సీపై జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ధ్వజం
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:25 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కృష్ణాజిల్లా , సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు పొందిన వారిని జగన్ అండ్ కో అవమానపరుస్తున్నారని ఆగ్రహించారు. ఈరోజు (ఆదివారం) మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు.
పేర్ని నాని సిగ్గు విడిచి రోడ్లపై తిరుగుతున్నారు..
మాజీ మంత్రి పేర్ని నాని సిగ్గు విడిచి రోడ్లపై తిరుగుతున్నారని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ఆయన వయసుకు తగ్గ మాటలు మాట్లాడకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పక్క నియోజకవర్గాలకు వెళ్లి పోటుగాడిలా నాని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐదేళ్లలో మంత్రిగా, ఎమ్మెల్యేగా జిల్లాకు ఆయన ఏం చేశారో.. చెప్పే దమ్ముందా అని సవాల్ చేశారు. వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇస్తానన్న నిధులను కూడా తమకువద్దని లెటర్లు రాసి వెనక్కు పంపించారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News