Share News

కొడాలి నాని జాగ్రత్తగా ఉండు.. ఎమ్మెల్యే రాము స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Nov 24 , 2026 | 07:35 PM

మాజీ మంత్రి కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఎక్కడికీ వెళ్లకుండా చివరి రోజు బఫూన్‌లా ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

కొడాలి నాని జాగ్రత్తగా ఉండు.. ఎమ్మెల్యే రాము స్ట్రాంగ్ వార్నింగ్
Venigandla Ramu

కృష్ణాజిల్లా గుడివాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కొడాలి నానిపై (Kodali Nani) తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఎక్కడికీ వెళ్లకుండా చివరి రోజు బఫూన్‌లా ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు (మంగళవారం) గుడివాడ ప్రజావేదికలో రాము మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఆయన గురించి తాను పట్టించుకోవడం లేదని అన్నారు. తన దృష్టి అంతా గుడివాడ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంపైనే ఉందని చెప్పుకొచ్చారు. రెండున్నరేళ్లు పడుకుని... స్థానిక ఎన్నికల ప్రచారం చివరి రోజు కొడాలి నాని డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను స్కాములు చేశానంటూ ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.


దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం..

స్కాములు చేయడంలో కొడాలి నానికి మించినవారు ఎవరు లేరని ఎమ్మెల్యే రాము వ్యంగ్యంగా మాట్లాడారు. తనకు, నానికి కామన్ ఫ్రెండ్ అయినా ఓ డిప్యూటీ తహసీల్దార్ కుమారుడి పేరు మీద బ్యాంకు లోన్లు తీసుకున్నారని ఆరోపించారు. భారీగా డ్యూ నోటీసులు చూసి... నాని చేసిన మోసపు బాధతో ఆయన చనిపోయారని అన్నారు.సెంటు భూముల మెరక పేరుతో అమాయకుల పేర్లపై ఖాతాలు తెరిచి భారీ వర్కులు చేసి డబ్బులు నొక్కేశారని ధ్వజమెత్తారు. జీఎస్టీ నోటీసులు వస్తేగానీ ఈ విషయం గురించి నియోజకవర్గంలో ఎవరికీ తెలియలేదని చెప్పుకొచ్చారు. నాని స్కాములు బయటకు వస్తే బతుకు బస్టాండ్ అవుతుందని ఎద్దేవా చేశారు. నాని జాగ్రత్తగా ఉండాలని.. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తర్వాత పరిణామాలు నువ్వే చూస్తావని తీవ్రంగా హెచ్చరించారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రావాలని ఎమ్మెల్యే రాము సవాల్ చేశారు.


జెండాను అవమానిస్తే ఊరుకోను..

అలాగే, బొమ్ములూరులో కూటమి జెండా తొక్కిన ఘటనపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పందించారు. జాతీయ జెండా తర్వాత పార్టీ జెండానే గొప్పదని.. జెండాను అవమానిస్తే ఊరుకోనని హెచ్చరించారు. జెండా తొక్కిన వాళ్లు లేదా వారిని ప్రోత్సహించిన వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి భర్త వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే రాము హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

ఏపీని మారిటైం, ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 07:53 PM