Share News

విజయవాడ దసరా వేడుకలు.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తాకు ఆహ్వానం

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:08 PM

విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఆహ్వానం పలికారు.

విజయవాడ దసరా వేడుకలు.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తాకు ఆహ్వానం
Vijayawada Dussehra Celebrations

ఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు (Delhi CM Rekha Gupta) ఆహ్వానం పలికారు. విజయవాడ ఉత్సవ్ 2.0కు హాజరై నగర సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని కోరారు.


ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను.. మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. విజయవాడ దసరా ఉత్సవాల విశిష్ఠతను ఢిల్లీ సీఎంకు మంత్రి సత్యకుమార్, ఎంపీ చిన్ని వివరించారు. విజయవాడ ఆధ్యాత్మిక, సంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటేందుకు విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు

ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్

ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 05:43 PM