వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు: బొండా ఉమా
ABN , Publish Date - Aug 30 , 2026 | 02:57 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు (MLA Bonda Umamaheswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను సాక్షాత్తు విజయసాయి రెడ్డి చెప్పారని అన్నారు.
విజయవాడ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు (MLA Bonda Umamaheswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను సాక్షాత్తు విజయసాయి రెడ్డి చెప్పారని అన్నారు. ఈరోజు (ఆదివారం) విజయవాడలో మీడియాతో బొండా ఉమా మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు బలవంతపు మతమార్పిడులు చేయించారని విజయసాయి రెడ్డి చెప్పారని అన్నారు.
మేఘనను మతం మార్చుకోమని ఒత్తిడి చేశారు..
మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన కూడా తనను ఎలా మోసం చేశారో చెప్పారని బొండా ఉమా అన్నారు. పెళ్లి తర్వాత తనను మతం మార్చుకోమని ఒత్తిడి చేశారని మేఘన చెప్పారన్నారు. వైసీపీ హయాంలో రాముడి విగ్రహా తల నరికేశారని ధ్వజమెత్తారు. అంతర్వేదిలో రథం తగులబెట్టారని మండిపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను అపవిత్రం చేశారని ఆగ్రహించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసి... కోట్ల రూపాయలు సంపాదించారని దుయ్యబట్టారు. శ్రీవారి హుండీలో కూడా డబ్బులు కొట్టేశారని ధ్వజమెత్తారు.
శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు..
‘వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు. మీ హయాంలో జరిగిన నేరాలు, కుంభకోణాలు బయటకు వస్తుంటే మీరు భయపడిపోతున్నారు. మీ తప్పులను కోర్టులు, మీడియా బయటపెడుతుంటే మీరు ఆందోళన చెందుతున్నారు. మీలాగా ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఎవరి వల్లా కాదు. మీ అవసరాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మీ లాగా కులాలు, మతాల మధ్య మేము చిచ్చు పెట్టలేదు... పెట్టబోం. మీ హయాంలో జరిగిన కుట్రలు, కుతంత్రాలను అప్పటిలో మీ నేతలు, మీ మాజీ మంత్రుల కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారని.. ఈ విషయాలను ప్రజలు గమనించాలి’ అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News