Share News

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ.. పార్టీల వారీగా వివరాలివే

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:57 AM

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలవగా.. 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ.. పార్టీల వారీగా వివరాలివే
AP Local Body Elections

అమరావతి, అక్టోబర్ 24: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలవగా.. 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున 3,315 జెడ్పీటీసీ స్థానాలకు, 25,016 ఎంపీటీసీ స్థానాలకు పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు మొత్తం 22,013 నామినేషన్లు వేశారు. అలాగే వైసీపీ అభ్యర్థులు 20,556 నామినేషన్లను దాఖలు చేశారు. జనసేన పార్టీ తరఫున 4,609 మంది నామినేషన్లు, బీజేపీ నుంచి 1,150 నామినేషన్లు వేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరఫున 2,078 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ నుంచి 1,815 మంది నామినేషన్లు వేయగా, జనసేన పార్టీ నుంచి 679, బీజేపీ తరపున 255 నామినేషన్లు దాఖలు చేశారు. ఇంత భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనప్పటికీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు నుంచి రావడం, తప్పుడు ఆరోపణలు చేసి వెళ్లిపోవడం ఇదీ జగన్ హిట్ అండ్ రన్ థియరీ అంటూ కూటమి పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేవలం ప్రెస్‌మీట్లు పెట్టడానికే జగన్ రెడ్డి బెంగళూరు నుంచి అమరావతి వస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా.. అటెండెంట్ అరెస్ట్

అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 12:09 PM