Share News

మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా.. అటెండెంట్ అరెస్ట్

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:37 AM

హైదరాబాద్‌లోని కవాడిగూడలో పవర్ గ్రిడ్ కార్యాలయంలో మహిళల వాష్రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది.

మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా.. అటెండెంట్ అరెస్ట్
Hidden Camera

హైదరాబాద్, అక్టోబర్ 24: నగరంలోని కవాడిగూడలో పవర్ గ్రిడ్ కార్యాలయంలో మహిళల వాష్రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది. వాష్‌బేసిన్ కింద డబుల్ సైడెడ్ టేప్‌తో ఫోన్‌ అతికించిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 13న వాష్‌రూమ్‌లో ఫోన్‌ను మహిళా ఉద్యోగిని గుర్తించారు. ఈ క్రమంలో ఫోన్ ఎవరిదని ప్రశ్నించగా అటెండెంట్ భరత్.. ఫోన్‌ను లాక్కొని పరుగెత్తినట్లు తెలుస్తోంది. దీంతో సహోద్యోగులు, భద్రతా సిబ్బంది సహకారంతో అటెండెంట్‌ను ఉద్యోగులు పట్టుకున్నారు.


ఫోన్‌లోని వీడియోలు పరిశీలించేందుకు ప్రయత్నించగా పిన్‌లాక్ ఫోల్డర్ గుర్తించారు. పిన్ నంబర్ అడగ్గానే భయపడిపోయిన భరత్ ఫోన్‌ను నేలకేసి కొట్టి పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ వ్యవహారంపై బాధితురాలను పోలీసులను ఆశ్రయించారు. మహిళా ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఈనెల 19న గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు లోతైన దర్యాప్తు కోసం సిటీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ధ్వంసమైన ఫోన్ నుంచి డేటా రికవరీ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఎప్పుడు... ఏం జరిగింది..?

టెహ్రాన్‌పై మరోసారి కాలు దువ్వుతున్న ట్రంప్.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న ఇరాన్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 10:15 AM