నేనొస్తే తాటతీస్తా
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:41 AM
‘మరో రెండేళ్లలో నేను అధికారంలోకి వస్తున్నా. సీఎం చంద్రబాబు, ఎస్‌ఈసీ పునేఠా, డీజీపీ హరీశ్‌గుప్తా, డీఐజీలు, కలెక్టర్ల తాట తీస్తా. చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు.
సీఎం, ఎస్‌ఈసీ, డీజీపీ, కలెక్టర్లకు జగన్ వార్నింగ్
నామినేషన్లను అడ్డుకోవడం న్యాయమేనా?
నా హయాంలో ఒక్క అరాచకమైనా జరిగిందా?
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడండి
ప్రెస్‌మీట్‌లో 2.43 గంటల పాటు ప్రసంగం
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ‘మరో రెండేళ్లలో నేను అధికారంలోకి వస్తున్నా. సీఎం చంద్రబాబు, ఎస్‌ఈసీ పునేఠా, డీజీపీ హరీశ్‌గుప్తా, డీఐజీలు, కలెక్టర్ల తాట తీస్తా. చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రజాసామ్యంలో నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింస, బెదిరింపులు చూశాక అరాచక ఆంధ్రప్రదేశ్ కాక మరేమిటని, తమ హయాంలో ఎక్కడైనా ఇలాంటి ఘటన ఒక్కటైనా జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘నామినేషన్ పత్రాలు చించేసి, కుట్ర చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా స్థానిక ఎన్నికలు గెలుస్తున్నామని సంబరపడిపోతున్నారేమో? తప్పు చేసిన ప్రతిఒక్కరినీ సంఘటనల వారీగా ఆధారాలతో సహా గుర్తుంచుకుని పేరుపేరునా చట్టప్రకారం తాటతీస్తా’ అని హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సానుకూల మీడియా సంస్థల ప్రతినిధులతో దాదాపు 2.43 గంటల సేపు ఆయన మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా బీజేపీవోడు నామినేషన్ వేయనీయడం లేదని కాంగ్రెస్ వాడంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా? వైసీపీవోడు నామినేషన్లు వేసేలా తెలుగుదేశంవోడు చూడాలి’ అని అన్నారు.
ముఖ్యమంత్రి, ఎస్‌ఈసీ, డీజీపీ, కలెక్టర్లు, పోలీసు అధికారులంతా కుమ్మక్కై స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగకుండా రాక్షసుల్లా వ్యవహరించారంటూ ఆరోపించారు. మహిళల పట్ల టీడీపీ నేతలు అనుచితంగా ప్రవర్తించారని, పోలీసులు కొట్టారని విమర్శించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు కరడుగట్టిన అభిమాని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎస్‌ఈసీగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రశాంతంగా నామినేషన్లను స్వీకరించి, ప్రజాస్వామ్యయుతంగా 86 శాతం స్ట్రయిక్‌రేట్‌తో విజ యం సాధించామన్నారు.
ఈసందర్భంగా పచ్చమూకల దాడి పేరిట బుక్‌ను జగన్‌రిలీజ్ చేశారు. ఈ నెల 25న సుప్రీంకోర్టుకు మరోసారి వెళ్తామని చెప్పారు. ఇప్పుడుటైమ్ చంద్రబాబుదని, టైమ్ మారుతుందని, ఎక్కడున్నా చట్టం ముందు దోషులుగా తీసుకువస్తానని టీడీపీ నేతలు, పోలీసు అధికారులను హెచ్చరించారు. కూటమి నేతలే వైసీపీ అభ్యర్థులుగా డమ్మీ నామినేషన్లు వేస్తూ, ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల