ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:38 AM
చ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చిలో జరగనున్న ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమై మార్చి 16తో ముగియనున్నాయి.
ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం
ఒంగోలు విద్య, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చిలో జరగనున్న ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమై మార్చి 16తో ముగియనున్నాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. గతంలో నెలరోజులపాటు జరిగిన పరీక్షలను కుదించి ప్రస్తుతం 16 రోజుల్లో ముగిసేలా షెడ్యూల్‌ను ప్రకటించారు. గత విద్యా సంవత్సరంలో రోజుకు ఒక సబ్జెక్టు పరీక్ష మాత్రమే నిర్వహించగా ప్రస్తుతం సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులకు ఒకేరోజు వివిధ సబ్జెక్టులకు నిర్వహించనున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు కొత్త సిలబస్‌లో పరీక్షలు ఉంటాయి. ఒకసారి ఫెయిలైన/ పాత విద్యార్థులకు పాత సిలబస్‌లోనే నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 24న తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, పేపర్-1, ఎలక్ర్టికల్ సబ్జెక్టులుగా గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ పరీక్ష ఉంటుంది. 26న ఇంగ్లీషు పేపర్-1, గణితం, సివిక్స్ పేపర్-1, 3న బయాలాజీ/హిస్టరీ పేపర్-1, 5న ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్-1, 9వతేదీన కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-1, 12న పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్1, 15న మోడ్రన్ లాంగ్వేజి, జియోగ్రఫి పేపర్-1 జరుగుతుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 25న తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ ఎలక్ట్రికల్ సబ్జెక్టులు, 27న ఇంగ్లీషు, మార్చి 2న గణితం, సివిక్స్, 4న బయాలాజీ, హిస్టరీ, 8న ఫిజిక్స్, ఎకనామిక్స్, 11న కెమిస్ట్రీ, కామర్స్, 13న పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్, 16న మోడ్రన్ లాంగ్వేజి, జియోగ్రఫి పరీక్షలు జరుగుతాయి.