సిద్దిపేటలో విషాదం.. చెరువులో 16 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యం
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:36 AM
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో విషాదం నెలకొంది. పల్లెపహాడు చెరువులో యువకుడి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. మృతుడు పార్థం ప్రదీప్(16)గా గుర్తించారు.
సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 24: జిల్లాలోని గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో విషాదం నెలకొంది. పల్లెపహాడు చెరువులో యువకుడి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. మృతుడు పార్థం ప్రదీప్(16)గా గుర్తించారు. వేములఘాట్‌కు చెందిన ప్రదీప్ అర్ధరాత్రి చెరువులోకి వెళ్లినట్లు సమాచారం. ఈరోజు(శనివారం) యువకుడి మృతదేహం చెరువులో తేలి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికితీశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రదీప్‌ది ఆత్మహత్యా లేక.. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా అనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా.. అటెండెంట్ అరెస్ట్
మల్కాజిగిరిలో మెగా కార్డన్ సెర్చ్.. 3,617 వాహనాల తనిఖీ, 126 సీజ్
Read Latest Telangana News And Telugu News