Share News

మాదాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్..

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:09 AM

వాటర్ ట్యాంకర్ల ద్వారా అక్రమ నీటి దందా నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మాదాపూర్‌లోని సున్నం చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోర్లను హైడ్రా తొలగిస్తుంది. శనివారం ఉదయం నుంచి జేసీబీల సహాయంతో 10కి పైగా బోర్ కనెక్షన్లను తొలగించింది.

మాదాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్..
HYDRA

హైదరాబాద్, అక్టోబర్ 24: వాటర్ ట్యాంకర్ల ద్వారా అక్రమ నీటి దందా నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మాదాపూర్‌లోని సున్నం చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోర్లను హైడ్రా తొలగిస్తుంది. శనివారం ఉదయం నుంచి జేసీబీల సహాయంతో 10కి పైగా బోర్ కనెక్షన్లను తొలగించింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఆపరేషన్‌ను హైడ్రా చేపట్టింది. సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమ నీటి దందా జరుగుతోందంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది.


అదీకాక.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అధిక నీటి వినియోగంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్షించారు. కొత్త బోర్లుకు అనుమతి ఇవ్వవద్దంటూ అధికారులను ఆయన ఆదేశించారు. అక్రమ బోర్ల ద్వారా నీటిని అధిక ధరలకు విక్రయించి.. భారీగా సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలకు హైడ్రా ఉపక్రమించింది. మరో 10 నెలల పాటు ఎల్‌నినో ప్రభావం కారణంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తుందని శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనిఖీలు.. భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

For More TG News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 11:32 AM