Share News

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:50 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులతో కలకలం రేగింది. శనివారం ఉదయం విమానాశ్రయానికి పలు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్, అక్టోబర్ 24: నగరంలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులతో కలకలం రేగింది. శనివారం ఉదయం విమానాశ్రయానికి పలు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. స్థానిక పాఠశాలలను పేల్చేస్తామంటూ ఈ మెయిల్స్‌ ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో విమానాశ్రయం పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి వివిధ సందర్బాల్లో వచ్చిన 12 బెదిరింపు ఈ మెయిల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.


తదుపరి దర్యాప్తు కోసం హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఈ కేసును బదిలీ చేశారు. బెదిరింపు ఈ-మెయిల్స్‌ వెనుక ఎవరున్నారు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనిఖీలు.. భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

ఏసీబీ అధికారుల దాడులు.. హెడ్ కానిస్టేబుల్ ఆస్తులు రూ.66 కోట్లు

For More TG News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 09:59 AM