శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనిఖీలు.. భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:32 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.1.56 కోట్లు విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.1.56 కోట్లు విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. ఈ నగదుకు సంబంధించి సరైనప్రతాలు చూపించకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కౌలాలంపూర్ వెళ్లేందుకు ఎయిర్ ఏషియా విమానం కోసం వచ్చిన పురుషుడి వద్ద 66,600 అమెరికన్ డాలర్లు, 3,773 మలేషియా రింగిట్లు, 2 సింగపూర్ డాలర్లు.. అలాగే మహిళా ప్రయాణికురాలు వద్ద 97,600 అమెరికన్ డాలర్లు ఉన్నట్లు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. భారతీయ కరెన్సీలో పురుషుడి వద్ద పట్టుబడిన నగదు సుమారు 63.62 లక్షలు, మహిళ వద్ద పట్టుబడిన నగదు.. సుమారు 91.94 లక్షలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వివరించారు.
ట్రాలీ బ్యాగుల్లో దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో ఈ విదేశీ కరెన్సీని వారు దాచినట్లు గుర్తించామని తెలిపారు. కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం విదేశీ కరెన్సీ, ట్రాలీ బ్యాగుల స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అక్టోబర్ 22–23 తేదీల్లో హైదరాబాద్ జోన్‌లో డీఆర్‌ఐ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏసీబీ అధికారుల దాడులు.. హెడ్ కానిస్టేబుల్ ఆస్తులు రూ.66 కోట్లు
2028 నాటికి భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
For More TG News And Telugu News