Share News

ఏసీబీ అధికారుల దాడులు.. హెడ్ కానిస్టేబుల్ ఆస్తులు రూ.66 కోట్లు

ABN , Publish Date - Oct 24 , 2026 | 07:18 AM

ఆ హెడ్ కానిస్టేబుల్‌కు వివాదాల్లో ఉన్న ఆస్తులే టార్గెట్. అలా అతడు.. ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ. 66 కోట్లు సంపాదించాడు. ఆ హెడ్ కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడితోపాటు బంధువులు, అనుచరుల నివాసాలపై దాడుల చేశారు.

ఏసీబీ అధికారుల దాడులు..  హెడ్ కానిస్టేబుల్ ఆస్తులు రూ.66 కోట్లు

ఇండోర్, అక్టోబర్ 24: ఆ హెడ్ కానిస్టేబుల్‌కు వివాదాల్లో ఉన్న ఆస్తులే టార్గెట్. అలా అతడు.. ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ. 66 కోట్లు సంపాదించాడు. ఆ హెడ్ కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడితోపాటు బంధువులు, అనుచరుల నివాసాలపై దాడుల చేశారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్ కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చాలా కాలంగా అతడు విధులకు దూరంగా ఉంటున్నాడు. కానీ తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని వివాదాల్లో ఉన్న ఆస్తులను ఫిరోజ్ ఖాన్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఫిరోజ్‌ నివాసంతోపాటు అతడి బంధువుల నివాసాలపై దాడుల చేశారు.


ఈ దాడుల్లో ఇళ్లు, వ్యవసాయ భూములు, నివాస, వాణిజ్య స్థలాలు.. మొత్తం 50 స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అవన్నీ ఫిరోజ్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులపై కొనుగోలు చేసినట్లు ఈ దాడుల్లో గుర్తించారు. వీటి విలువ రూ.65.72 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఫిరోజ్.. తన 24 సంవత్సరాల సర్వీసులో రూ.75 లక్షలు సంపాదించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు లెక్క తేల్చారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

For More National News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 07:23 AM