డ్రైవింగ్ లైసెన్స్‌లకు కలర్ కోడ్!
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:24 AM
భారతీయులు, విదేశీయులకు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సుల్లో(కొత్తవి/ రెన్యువల్) వ్యత్యాసం కనిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
భారతీయులకో రంగు, విదేశీయులకు మరోటి..
దరఖాస్తుదారు వయసు, చిరునామా
ధ్రువీకరణకు అఫిడవిట్, ఎల్‌ఐసీ పాలసీ
లైసెన్స్ కార్డుపై లైసెన్స్‌దారు బ్లడ్ గ్రూపు,
మొబైల్ నంబరు, ఎమర్జెన్సీ కాంటాక్టు
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, అక్టోబరు 23: భారతీయులు, విదేశీయులకు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సుల్లో(కొత్తవి/ రెన్యువల్) వ్యత్యాసం కనిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కార్డులు వేర్వేరు రంగుల్లో ఉండేలా ప్రత్యేక రంగుల్లో ముద్రించాలని ప్రతిపాదించింది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల(ఎంఓఆర్‌టీహెచ్) విడుదల చేసిన ముసాయిదాలో ఈ కలర్ కోడ్ అంశం కూడా ఉంది. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారు వయసు, చిరునామా ధ్రువీకరణకు అఫిడవిట్‌లు, ఎల్‌ఐసీ పాలసీలను ఆమోదించే అంశాన్ని కూడా ముసాయిదాలో ప్రతిపాదించింది. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్‌పై లైసెన్స్‌దారు బ్లడ్ గ్రూపు, ఫోన్ నెంబరు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన వారి నెంబరు తప్పనిసరిగా ముద్రించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇక, డ్రైవింగ్ లైనెస్స్ దరఖాస్తుదారుకు రహదారి భద్రత నియమాలపై ఉన్న అవగాహనను అంచనా వేసేందుకు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత మార్కులను 60 నుంచి 75 శాతానికి పెంచుతూ ముసాయిదాలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే