మల్కాజిగిరిలో మెగా కార్డన్ సెర్చ్.. 3,617 వాహనాల తనిఖీ, 126 సీజ్
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:02 AM
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సీల్-ఎమ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సీల్-ఎమ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మూడు జోన్ల పరిధిలో దాదాపు 54 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్‌లో 1,098 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 3,617 వాహనాలు, 3,448 మందిని తనిఖీ చేశారు. ఇందులో భాగంగా 365 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు, ఈ-చలాన్లు విధించగా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 28 మందిపై కేసులు నమోదు చేశారు.
వివిధ కారణాలతో 126 వాహనాలను సీజ్ చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగదు, మద్యం, డ్రగ్స్, ఆయుధాలకు సంబంధించి 20 పైగా వాహనాలను సీజ్ చేయగా... 118 పెటీ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ఎల్ బీ నగర్ జోన్‌లో అత్యధికంగా 1,392 వాహనాలు, 1,111 మందిని తనిఖీ చేశారు. ఎల్ బీ నగర్ జోన్‌లోనే 20 వాహనాలను సీజ్ చేయగా.. 57 పెటీ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
టెహ్రాన్‌పై మరోసారి కాలు దువ్వుతున్న ట్రంప్.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న ఇరాన్..
మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా.. అటెండెంట్ అరెస్ట్
Read Latest Telangana News And Telugu News