Share News

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతో జర జాగ్రత్త!

ABN , Publish Date - Oct 24 , 2026 | 10:38 AM

ప్రస్తుతం నగర జీవనశైలిలో వీధులు, రోడ్ల పక్కన ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల, ఇతర ఆహార పదార్థాలను లొట్టలేసుకుని తినే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతో జర జాగ్రత్త!
hyderabad fast food centers

  • అపరిశుభ్రతతో పొంచి ఉన్న ప్రమాదం

  • ఆరోగ్య ప్రమాణాలు పాటించని వైనం

హైదరాబాద్: ప్రస్తుతం నగర జీవనశైలిలో వీధులు, రోడ్ల పక్కన ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల, ఇతర ఆహార పదార్థాలను లొట్టలేసుకుని తినే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఒక ఇంట్లో భార్య భర్త, పిల్లలుంటే.. పిల్లల చదువులో బిజీగా ఉండడం, అమ్మా, నాన్న ఇద్దరు ఉద్యోగాలతో తీరిక లేకపోవడం ఒక కారణమైతే.. కొందరు వంటలు చేసుకునేందుకు బద్దకించడం మరొక అంశం. రుచికరమైన ఫ్రైడ్‌ రైస్‌, నూడిల్స్‌, మంచూరియా వంటి ఆహార పదార్థాలను తినేందుకు సాయంత్రం సమయంలో ప్రజలు లైన్‌ కడుతున్నారు. కానీ రుచికరమైన ఆహారం వెనకాల ఉన్న భయంకరమైన అపరిశుభ్రతను, ఆరోగ్య ప్రమాదాలను గమనించడంలేదు. వంట చేసే ప్రాంతంలో చెత్త, పాడైన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్‌ వస్తువులుంటున్నాయి. ప్రధానంగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్ల నిర్వాహకులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో అపరిశుభ్ర వాతావరణంలోనే వంటలు తయారు చేస్తున్నారు. ఉదా.. కుత్బుల్లాపూర్‌ జోనల్‌ జీడిమెట్ల సర్కిల్‌ పరిధిలో నడుస్తున్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తీసుకోవచ్చు.


జీడిమెట్ల సర్కిల్‌లోని పద్మానగర్‌ ఫేజ్‌-2 రింగురోడ్డు, శ్రీనివాసనగర్‌, కాకతీయనగర్‌, ప్రసూననగర్‌, అంబేడ్కర్‌నగర్‌, చింతల్‌ ప్రధాన రహదారితో పాటు కొంపల్లి సర్కిల్‌లోని అయోధ్యనగర్‌, సుచిత్ర, ఉషోదయ టవర్స్‌ ప్రాంతాల్లో పరిశుభ్రత మచ్చుకైనా కన్పించడంలేదు. వంటలు చేసే వారు కనీసం గ్లౌజులు, తల క్యాప్‌లు ధరించరు. రోడ్ల పక్కన ఉండడంతో వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి కణాలు ఆహారంలో పడుతున్నాయి. చెత్త డబ్బాల నుంచి వచ్చే దుర్గంధం, దానిపై ఈగలు, దోమలు వాలడం వల్ల విషపూరితమయ్యే ప్రమాదముంది. ఇటీవల శ్రీనివా్‌సనగర్‌ మెయిన్‌ రోడ్డులో ఉన్న ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో ఫ్రైడ్‌ రైస్‌ చేసుకున్న వారికి మాడిపోయిన చికెన్‌ ముక్క దుర్వాసనతో వచ్చిందని అడిగితే అర్ధరాత్రి 12 గంటలకు ఇది దొరకడమే కష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు.


city5.2.jpgఆరోగ్యంపై ప్రభావం..

అపరిశుభ్రత వాతావరణంలో చేసే ఆహారాలను తినడం వల్ల ప్రజలు పలు రకాల అనారోగ్యాలకు గురయ్యే అవకాశముంది. ఆహారంతో పాటు కలుషిత నీటి వల్ల వాంతులు, విరోచనాలు, ఫుడ్‌ పాయిజన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. టైఫాయిడ్‌, కలరా, గ్యాస్ట్రిక్‌, కాలేయానికి సంబంధించిన రోగాలు ధరిచేరడం ఖాయం. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఇలాంటి హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై తగిన దృష్టి సారించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసినప్పటికీ జీడిమెట్ల సర్కిల్‌లో మాత్రం చర్యలు కన్పించడంలేదు. కుత్బుల్లాపూర్‌ జోనల్‌గా ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ విభాగం అధికారుల్లో ఒక్కరు కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారికి వివరణ కాల్‌ చేయగా స్పందించకపోవడం గమనార్హం.


పరిశుభ్రత లేకుంటే చర్యలు

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడేలా వ్యవహరిస్తున్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై తనిఖీలు చేస్తాం. కనీస నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

  • జడ్సీ పింకేప్ కుమార్‌, జోనల్‌ కమిషనర్‌, కుత్బుల్లాపూర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 10:38 AM