మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:03 AM
డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు మీ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌తోపాటు ఇకపైౖ ‘వీడియో వీక్షణ’ సదుపాయం కూడా పొందవచ్చు. ఇందుకు సంబంధించి రవాణా శాఖ, మీ-సేవ విభాగం అధికారుల మధ్య అవగాహన కుదిరింది
ఆన్‌లైన్ విధానంపై అవగాహన లేనివారి కోసం సదుపాయం
దీపావళి తర్వాత అమల్లోకి
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు మీ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌తోపాటు ఇకపైౖ ‘వీడియో వీక్షణ’ సదుపాయం కూడా పొందవచ్చు. ఇందుకు సంబంధించి రవాణా శాఖ, మీ-సేవ విభాగం అధికారుల మధ్య అవగాహన కుదిరింది. దీపావళి పండుగ తర్వాత ఈ సేవలు దరఖాస్తుదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రహదారి భద్రత పెంపులో భాగంగా కొత్తగా డ్రైవింగ్ లైసెన్సు పొందే వారికి తెలంగాణ రవాణా శాఖ వీడియో వీక్షణ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ వీడియోలను పూర్తిగా చూసిన తర్వాతే ట్రాక్ టెస్టుకు అనుమతి ఇస్తారు. ఈ విధానం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు, స్మార్ట్ ఫోన్ వాడకం తెలియని వారు లైసెన్సు పొందేందుకు వీడియో వీక్షణం ఇబ్బందికరంగా మారింది.
దీనిని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు ఉచితంగా ఆన్‌లైన్‌లో చూడాల్సిన వీడియోలకు లాగిన్ చార్జీల పేరుతో రూ. 500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు మీ-సేవ కేంద్రాల్లోనే వీడియో వీక్షణ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. డ్రైవింగ్ లైసెన్సు కోసం స్లాట్ బుక్ చేస్తున్న తరహాలోనే ఇకపై ఆన్‌లైన్ వీడియో వీక్షణ సేవలు కూడా అందించాలని రవాణా శాఖ మీ-సేవ అధికారులను కోరింది. దరఖాస్తు దారుడి నుంచి నామమాత్రపు రుసుము వసూలు చేసి వీడియో వీక్షణ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 12వేల మందికిపైగా ఈ వీడియోలను వీక్షించారు. వీడియో చివర్లో అధికారులు సేకరించే ఫీడ్ బ్యాక్‌లో భాగంగా 80ుమంది ఈ వీడియోలు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. విదేశీ డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకొనే సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ వీడియోలను వీక్షించాల్సిందే.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు
Read Latest Telangana News And Telugu News