వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:58 AM
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు దీవుల సమీపంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో సునామీ ముప్పుపై ఆందోళన నెలకొంది.
వనాటు: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు దీవుల సమీపంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో సునామీ ముప్పుపై ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) వెల్లడించింది. అయితే, భూకంపం వల్ల జరిగిన నష్టం, ప్రాణనష్టంపై అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
వనాటు దీవుల్లోని సోలా ప్రాంతానికి పశ్చిమంగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. సముద్ర గర్భంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. భూకంప కేంద్రం సముద్రంలో తక్కువ లోతులో ఉండటంతో సమీప తీర ప్రాంతాలపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. అలాగే, ఇప్పటివరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. వనాటు ప్రాంతం భూకంపాలు తరచుగా సంభవించే పసిఫిక్ అగ్నిపర్వత వలయం (రింగ్ ఆఫ్ ఫైర్) పరిధిలో ఉంది. ఇక్కడ భూఫలకాల కదలికల కారణంగా ప్రకంపనలు సంభవిస్తుంటాయి. కాగా, తాజా భూకంపంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
టెహ్రాన్‌పై మరోసారి కాలు దువ్వుతున్న ట్రంప్.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న ఇరాన్..
జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు.. ఏడుగురి మృతి, 40 మందికి గాయాలు