Share News

నామినేషన్ల గడువు పొడిగించేలా ఆదేశించండి

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:28 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌ దాఖలు గడువును మరో 48 గంటలు పొడిగించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

నామినేషన్ల గడువు పొడిగించేలా ఆదేశించండి

  • నామినేషన్ల గడువు పొడిగించేలా ఆదేశించండి

  • హైకోర్టులో వైసీపీ వ్యాజ్యం... విచారణ ఎల్లుండికి వాయిదా

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌ దాఖలు గడువును మరో 48 గంటలు పొడిగించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు నమోదు చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ గంధం సునీత.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు. నామినేషన్‌ దాఖలులో తమ పార్టీ అభ్యర్థులకు అవరోధాలు కలిగిన చోట నామినేషన్లు వేసేందుకు వీలుగా గడువును మరో 48గంటల వరకు పెంచడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం లంచ్‌ మోషన్‌గా విచారణకు స్వీకరించింది. అప్పిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటు న్నారని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ... నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితులు లేవన్న పిటిషనర్‌ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

వైసీపీ తరఫున ఎంపీటీసీ ఎన్నికల్లో 12,500 నామినేషన్లు దాఖలయ్యాయని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనలను చూపించి, రాష్ట్రమంతా అలాంటి పరిస్థితులే ఉన్నట్లు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది త్రినాథ్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ వినతిపై ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో సమాచారం లేదన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 06:28 AM