Share News

స్థానిక ఎన్నికల్లో భారీ కుట్రకు జగన్ అండ్ కో ప్లాన్.. బీటెక్ రవి సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:29 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ రోజు అన్నదమ్ములిద్దరు భారీ కుట్ర చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

స్థానిక ఎన్నికల్లో భారీ కుట్రకు జగన్ అండ్ కో ప్లాన్.. బీటెక్ రవి సంచలన ఆరోపణలు
BTech Ravi

కడప జిల్లా, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy), కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి (BTech Ravi) సంచలన ఆరోపణలు చేశారు. రేపు (ఆదివారం) జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ రోజు అన్నదమ్ములిద్దరు భారీ కుట్ర చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు (శనివారం) పులివెందులలో మీడియాతో రవి మాట్లాడారు.


విధ్వంసం సృష్టించి కూటమి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం..

వైసీపీ వాహనాలు, జగన్ మీడియా లైవ్ వ్యాన్లను వారే దహనం చేసుకునే కుట్రకు పాల్పడుతారని బీటెక్ రవి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించి కూటమి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారని ధ్వజమెత్తారు. పులివెందుల ఆడిటోరియంలో వైసీపీకి సంబంధించిన ఇతర ప్రాంతాల వ్యక్తులు భారీగా చేరుకున్నారని ఆరోపించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేయాలని రవి విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని బీటెక్ రవి విన్నవించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 06:58 PM