జగన్ కుటుంబం జోలికొస్తే ఎవరినైనా దారుణంగా చంపేస్తారు: బీటెక్ రవి
ABN , Publish Date - May 24 , 2026 | 11:55 AM
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఓటమి చరిత్ర ఆనాడే మొదలైందని పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి వ్యాఖ్యానించారు.1968లో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి భార్య పులివెందుల సర్పంచ్‌గా పోటీచేశారని ప్రస్తావించారు.
కడప, మే 24 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఓటమి చరిత్ర ఆనాడే మొదలైందని పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి (BTech Ravi) వ్యాఖ్యానించారు. 1968లో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి భార్య పులివెందుల సర్పంచ్‌గా పోటీచేశారని ప్రస్తావించారు. వార్డు మెంబర్‌గా పోటీ చేసి కృష్ణమూర్తి చేతిలో జయమ్మ ఓడిపోయారని చెప్పుకొచ్చారు. ఈరోజు (ఆదివారం) కడప వేదికగా బీటెక్ రవి మాట్లాడారు. రాజకీయంగా అడ్డువస్తారని పేర్ల పార్థసారథిపై హత్యాప్రయత్నం చేశారని ఆరోపించారు. 1962లోనే పులివెందుల పీఎస్‌లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని ప్రస్తావించారు.
వారిని హత్య చేసిన చరిత్ర జగన్ కుటుంబానిది..
నమ్మి పెట్టుబడి పెట్టిన వెంకటనరసయ్యను హత్య చేసిన చరిత్ర జగన్ కుటుంబానిదని బీటెక్ రవి విమర్శించారు. వ్యాపారం కోసం సహకరించిన వ్యక్తినే చంపేస్తారా..? అని ప్రశ్నించారు. మంగంపేట బెరైటీస్ సొంతం చేసుకుని.. వచ్చిన ఆదాయంతో రాజకీయాల్లోకి జగన్ కుటుంబం ప్రవేశించిందని తెలిపారు. త్రివేణి స్టీల్స్ పెట్టి ఎదుగుతున్న వ్యక్తిని కూడా హత్య చేయించారని ధ్వజమెత్తారు. రాజారెడ్డి చెబితేనే మురళీమోహన్‌రెడ్డిని.. గంగిరెడ్డి, బాబుల్‌రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లోనే రాజారెడ్డి హత్య జరిగిందని అన్నారు. అబద్ధాలు, అరాచకాలే జగన్ సూత్రాలని విమర్శించారు. గత చరిత్ర తెలుసుకుని జగన్ మాట్లాడితే బాగుంటుందని బీటెక్ రవి హితవు పలికారు.
పరిటాల రవిని పొట్టనపెట్టుకున్నారు..
ప్రజాదరణ కలిగిన నాయకులను బతకనిచ్చేవారు కాదని బీటెక్ రవి పేర్కొన్నారు. తమకు తెలిసిన జగన్.. ప్రజలకు తెలిసిన జగన్ ఏంటో తెలియాలని చెప్పారు. జగన్ కుటుంబం జోలికొస్తే ఎవరినైనా దారుణంగా చంపేస్తారని ధ్వజమెత్తారు. మద్దెలచెరువు సూరితో జగన్ కుటుంబానికి స్నేహ సంబంధాలు లేవా..? అని ప్రశ్నించారు. జైలులో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవిని హత్య చేస్తారా..? అని దుయ్యబట్టారు. టీడీపీని విడిచిపెట్టి రాలేదని పరిటాల రవిని పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కే, ప్రభాకర్‌రెడ్డిని చంపాక పరిటాల రవిని చంపేశారని బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్
నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News