పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. 3, 4వ స్థానాలకే పరిమితం
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:21 PM
సార్వత్రిక ఎన్నికల నాటి కంటే పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి దిగజారిపోతున్నట్లు తెలుస్తోంది. 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘోర ఓటమిని మూటగట్టుకుని తీవ్ర పరాభవాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ చవి చూసిన విషయం తెలిసిందే
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నాటి కంటే పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి దిగజారిపోతున్నట్లు తెలుస్తోంది. 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘోర ఓటమిని మూటగట్టుకుని తీవ్ర పరాభవాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ చవి చూసిన విషయం తెలిసిందే. పట్టణ స్థానిక ఎన్నికల్లో ఉనికి కొల్పోయి మూడు, నాలుగు స్థానాలకే ఫ్యాన్ పార్టీ పరిమితమైంది. మేయర్లు, ఛైర్ పర్సన్లు, డివిజన్ ఎన్నికల్లో 3, 4వ స్థానాలతో సరిపెట్టుకుంది. 13 మేయర్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 10, జనసేన 2 స్థానాలు గెలుచుకోగా ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకుని వైసీపీ పరువు పొగొట్టుకుంది. మేయర్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది 100 శాతం స్ట్రెయిక్ రేట్‌ను టీడీపీ, జనసేన సాధించాయి.
13 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క స్థానానికే వైసీపీ పరిమితమైంది. కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లల్లోనూ మూడో స్థానానికి ప్రజలు ఆ పార్టీని పరిమితం చేశారు. 13 కార్పొరేషన్ల పరిధిలోని 922 డివిజన్లలో 596 స్థానాలను టీడీపీ గెలిచింది. 137 స్థానాలను జనసేన దక్కించుకోగా, కేవలం 110 స్థానాలతో మూడో స్థానానికి ఫ్యాన్ పార్టీ పరిమితమైంది. 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లకు జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీకి మూడో స్థానాన్ని ఓటర్లు ఇచ్చారు.
విశాఖపట్నం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, కడప, తిరుపతి కార్పొరేషన్లల్లోని డివిజన్ స్థానాలకు జరిగిన ఎన్నికలో మూడో స్థానంలో వైసీపీ నిలిచింది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఒక్క డివిజన్‌ను కూడా ఫ్యాన్ పార్టీ గెలవలేకపోయింది. మున్సిపాల్టీ, నగర పంచాయతీలకు జరిగిన ఛైర్‌పర్సన్ స్థానాల ఎన్నికల్లోనూ నాలుగో స్థానానికి వైసీపీ దిగజారింది. మొత్తంగా ప్రకటించిన 86 ఛైర్ పర్సన్ స్థానాల్లో టీడీపీ 59, జనసేన 18, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. కేవలం 3 స్థానాలు గెలుపొంది నాలుగో స్థానంలో నిలిచి వైసీపీ పరువు పోగొట్టుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News