Share News

YS Jagan: రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: జగన్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:31 PM

రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్నామని అన్నారు.

YS Jagan: రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: జగన్‌
YS Jagan Mohan Reddy

అమరావతి, జనవరి8 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతలపై (Rayalaseema Lift Irrigation Project) కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్నామని అన్నారు. రాయలసీమకు తాము తలపెట్టిన ఎత్తిపోతల.. సంజీవని లాంటిదని చెప్పుకొచ్చారు. నెల్లూరు, రాయలసీమ ప్రజలు చంద్రబాబును విలన్‌లా చూస్తున్నారని ఆరోపించారు. సీఎం సీట్లో కూర్చుని చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. ఇవాళ(గురువారం) తాడేపల్లి ప్యాలెస్‌లో మాట్లాడారు జగన్‌ మోహన్ రెడ్డి.


రేవంత్ వ్యాఖ్యలే సాక్ష్యం..

‘సొంత రాష్ట్రాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు తాకట్టుపెట్టారు. రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ వ్యాఖ్యలే సాక్ష్యం. తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డితో చంద్రబాబు రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేశారు. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మంత్రులు మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ వెనుక గొప్ప ఉద్దేశ్యం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల ఆపమని కోరినట్లు సీఎం రేవంత్‌ ప్రకటించారు. రేవంత్ వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు ఏపీని అమ్మకానికి పెట్టారని చెప్పడానికి నిదర్శనం. శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీళ్లు వస్తాయి.. పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇరవై ఏళ్లలో మూడు, నాలుగుసార్లే అన్ని నీళ్లు తెచ్చుకోగలిగాం’ అని అని వైఎస్ జగన్ తెలిపారు.


ఇష్టారీతిన నీళ్లు తీసుకుంటున్నారు..

‘800 అడుగుల్లోపే 2 టీఎంసీల నీళ్లు తీసుకునేందుకు.. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టారు. SLBCతో 45 టీఎంసీలు తరలించేలా పనులు జరుగుతున్నాయి.777 అడుగుల నుంచే లెఫ్ట్ పవర్‌హౌస్‌ ద్వారా..4 టీఎంసీల నీళ్లు తెలంగాణ ఖాళీ చేస్తున్న పరిస్థితి. మనకు నీళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం. తెలంగాణలో పవర్‌హౌస్ ద్వారా ఇష్టారీతిన నీళ్లు తీసుకుంటున్నారు. తెలంగాణలో లిఫ్ట్‌లు, పవర్‌హౌస్‌తో రోజుకు 8 టీఎంసీలు తీసుకుంటున్నారు. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల పవర్‌హౌస్‌లు తెలంగాణే ఆపరేట్‌ చేస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికారు. అందుకే చంద్రబాబు నోరు మెదపలేని పరిస్థితి. మేం వచ్చే నాటికే తెలంగాణలో లిఫ్ట్‌ల పనులు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ

చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావు.. ఎంపీ షాకింగ్ కామెంట్స్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 08 , 2026 | 06:29 PM