Share News

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

ABN , Publish Date - Aug 14 , 2026 | 10:12 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని
Yarapatineni Srinivasa Rao

గుంటూరు జిల్లా, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఐదేళ్లు డీఎస్సీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈరోజు (శుక్రవారం) గుంటూరు జిల్లా వేదికగా యరపతినేని మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని పేర్కొన్నారు.


మంచిని చెడుగా చూపడం వైసీపీ నైజం..

మంచిని చెడుగా చూపడం వైసీపీ నైజంగా కనిపిస్తోందని యరపతినేని విమర్శించారు. డీఎస్సీ విజేతలు స్వయంగా వచ్చి అంతా సజావుగా జరిగిందని ప్రభుత్వానికి చెప్పారని ప్రస్తావించారు. ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధిపై వైసీపీ విషం చిమ్ముతోందని ఆగ్రహించారు. వైసీపీ వంటి రాజకీయ పార్టీ ఉండటం ఏపీకి దురదృష్టమని చెప్పారు. వై నాట్ 175 నుంచి 11 సీట్లు వచ్చినా వారిలో మంచి ఆలోచనలు రావటం లేదని విమర్శించారు. వైసీపీ నేతల మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.


పరామర్శల పేరుతో వ్యవస్థలు ధ్వంసం..

రోజూ ఎక్కడ శవం దొరుకుతుందా అని వారు ఎదురు చూస్తున్నారని యరపతినేని సెటైర్లు గుప్పించారు. పరామర్శల పేరుతో వైసీపీ నేతలు వ్యవస్థలను ధ్వంసం చేసి, ప్రజలను పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రప్పా రప్పా అని నరికి 11కు వచ్చారని.. ఇంకా ఏం నరుకుతారని ప్రశ్నించారు.


రప్పా రప్పా అని ఫ్లెక్సీలు ఎందుకు..

రప్పా రప్పా అని ఫ్లెక్సీలు ఎందుకని యరపతినేని శ్రీనివాసరావు నిలదీశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేశ్‌లను ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. దళిత మహిళా హోం మంత్రిగా ఉంటే అవమానరుస్తారా..? అని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో కూడా ఓ లిమిట్ ఉంటుందని తెలిపారు. లిమిట్ దాటితే తాము చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ హయాంలో హత్యా రాజకీయాలను పెంచి పోషించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అలాంటి వాటికి దూరంగా ఉందని స్పష్టం చేశారు.


వైసీపీ కాలగర్బంలో కలిసి పోతుంది..

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శిస్తా అనే పేరుతో జగన్ ఐదు గంటల పాటు ప్రదర్శన చేశారని యరపతినేని విమర్శించారు. విరూపాక్షను అరెస్టు చేయొద్దని.. నోటీసులు ఇవ్వాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మరి నంద్యాలలో చంద్రబాబుకు నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఇంత వింత పోకడ పోయినోళ్లు వ్యవస్థలో మనుగడ లేకుండా పోయారని విమర్శించారు. వైసీపీ కూడా కాలగర్బంలో కలిసి పోతుందని యరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.


వార్తలు కూడా చదవండి...

సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు

వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్

సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 10:51 AM