Share News

సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:16 AM

సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు.

 సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశను, బకింగ్‌హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని ఈరోజు (గురువారం) సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించానని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. రైతులు లేకపోతే రాజధాని లేదని చెప్పుకొచ్చారు. ఆనాడు అమెరికాలో పర్యటించి.. సైబరాబాద్ రూపకల్పన చేశామని ప్రస్తావించారు.


సింగపూర్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది..

రూపాయి తీసుకోకుండా అమరావతి కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ రూపొందించిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఏపీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. అమరావతి రైతుల త్యాగమే కాదని.. స్ఫూర్తి కూడా చాలా గొప్పదని ప్రశంసించారు. నాడు రాజధాని ఎక్కడ కట్టాలనే కన్ఫూజన్ ఉండేదని తెలిపారు. శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఇందుకోసం ఓ కమిటీ వేశారని ప్రస్తావించారు. రాజధానిగా అమరావతినే మెజార్టీ ప్రజలు కోరుకున్నారని ప్రస్తావించారు. ప్రజల నిర్ణయం మేరకే రాజధాని అమరావతి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఆనాడు సైబరాబాద్‌ను నిర్మించామని చెప్పారు. హైదరాబాద్‌ ఆదాయం పెరగడానికి తాను చేసిన అభివృద్ధే కారణమని పేర్కొన్నారు.


ప్రజల నిర్ణయం మేరకే రాజధాని అమరావతిని ఎంపిక చేశాం..

ప్రజల నిర్ణయం మేరకే రాజధాని అమరావతిని ఎంపిక చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆనాడు హైటెక్‌సిటీ నిర్మిస్తే కొంతమంది ఎగతాళి చేశారని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని వెల్లడించారు. హైటెక్‌సిటీ నిర్మాణం దశలోనూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నామని చెప్పారు. విమర్శలు పట్టించుకోకుండా సైబరాబాద్ నిర్మాణంపై దృష్టి పెట్టామని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ ఎదుగుదల చూసి గర్వపడుతున్నామని అన్నారు. రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించానని చెప్పారు. హైదరాబాద్‌ను మించిన మహానగరాన్ని నిర్మించాలని తాము సంకల్పించామని అన్నారు. అప్పుడే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ వచ్చిందని ప్రస్తావించారు. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములు చేయాలనుకున్నామని తెలిపారు. ఒక్క మాట చెప్పగానే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని చెప్పారు.


అమరావతిని వైసీపీ నేతలు ఎగతాళి చేశారు..

భూములు ఇచ్చిన అమరావతి రైతులకు పాదాభివందనం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులు లేకపోతే రాజధాని లేదన్నారు. ఆనాడు అమెరికాలో పర్యటించి.. సైబరాబాద్ రూపకల్పన చేశామని ప్రస్తావించారు. సింగపూర్ మోస్ట్‌లివబుల్ కంట్రీ.. అందుకే ఆ మోడల్ తీసుకున్నామని వెల్లడించారు. గ్రాఫిక్స్ అంటూ అమరావతిని వైసీపీ నేతలు ఎగతాళి చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడొచ్చి చూడండి.. అమరావతి ఎలా ఉందో అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారని ప్రస్తావించారు. 5,10 కాదు.. 40వేల ఎకరాలు కావాలని జగన్ చెప్పారన్నారు. ఆ తర్వాత రాజధాని పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. జగన్ హయాంలో రాజధాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది.. అమరావతి ఉద్యమమని తెలిపారు. అమరావతి చరిత్రలో రైతులకు ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. దేవతల రాజధాని అమరావతి.. ఇక్కడ ఇబ్బందులు ఉండవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 02:20 PM