Share News

ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలు మళ్లీ రావాలి: అయ్యన్నపాత్రుడు

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:42 PM

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలు మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు కన్నా లక్ష్మీనారాయణను చూసి చాలా నేర్చుకోవాలని సూచించారు.

ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలు మళ్లీ రావాలి: అయ్యన్నపాత్రుడు
Ayyanna Patrudu

గుంటూరు జిల్లా, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలు మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు కన్నా లక్ష్మీనారాయణను చూసి చాలా నేర్చుకోవాలని సూచించారు. ఈరోజు (గురువారం) గుంటూరు జిల్లా వేదికగా మీడియాతో అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ఇప్పుడు జనం ఓసారి ఓటేస్తే.. రెండోసారి ఓటేయటం లేదని అన్నారు.


అలాంటిది ఆరుసార్లు ప్రజల మనసు దోచుకుని కన్నా లక్ష్మీనారాయణ గెలిచారని ప్రస్తావించారు. అప్పటిలా జనం లేరని.. పూర్వం నాయకులు ఇప్పుడు లేరని అన్నారు. కన్నా క్రమశిక్షణ, వచ్చిన వారిని పలకరించటం, పని అవుతుందంటే చేసి పెట్టడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. ప్రజలకు ఏం కావాలో వారి అవసరాలు తీర్చేలా పని చేశారని ప్రశంసించారు. కన్నా మాదిరిగా మిగతా వారు పని చేస్తే ఏపీ బాగుపడుతుందని తెలిపారు. రాజకీయాలు ఇప్పుడు వ్యాపారం అయ్యాయని అన్నారు. కన్నా మరింత ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 02:14 PM