టీడీపీ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబుపై వాటర్‌మన్ ఆర్టికల్ చర్చ.. నేతల ప్రశంసలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 09:38 AM
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఈరోజు (సోమవారం), రేపు (మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్‌షాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
అమరావతి, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఈరోజు (సోమవారం), రేపు (మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్‌షాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రారంభించారు. ముందుగా దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కాంక్లేవ్‌కు చంద్రబాబు, లోకేశ్, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు, పార్లమెంట్ పరిశీలకులు హాజరయ్యారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర సీఈవో నుంచి వాటర్‌మన్‌గా మారిన చంద్రబాబును మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. ఈ కాంక్లేవ్‌లో పాల్గొన్న నేతలు అందరు లేచి హర్షధ్వానాలు చేశారు. కేడర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అభివాదం చేశారు.
టీడీపీ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబుపై వచ్చిన వాటర్‌మన్ ఆర్టికల్‌పై టీడీపీ నేతలు చర్చించారు. ఒకప్పుడు సీఈఓగా పేరు తెచ్చుకున్న సీఎం.. ఇప్పుడు వాటర్‌మన్‌గా అభివర్ణిస్తూ జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తిగా చదివారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టులు, నీటి భద్రత, నీటి సంరక్షణ వంటి అంశాలను మంత్రులు గుర్తు చేసుకున్నారు. నీటి సరఫరాను అందించి కియా వంటి పెద్ద పరిశ్రమలను రాష్ట్రానికి వచ్చేలా చంద్రబాబు చేశారంటూ ప్రజాప్రతినిధులు కొనియాడారు. పట్టిసీమ ద్వారా కృష్ణ - గోదావరి నదులను అనుసంధానించి 500 టీఎంసీల నీటిని మళ్లించారని కృష్ణా-గుంటూరు జిల్లాల నేతలు ప్రశంసించారు.
ఒకప్పుడు కృష్ణా డెల్టాకు నీటిని అందించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగేవని... ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చి కృష్ణా డెల్టాకు సాగునీటి కష్టాలు తప్పించారని ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు అభిలాషించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తమ ప్రాంత చివరి భూములకు తరలించామంటే సీఎం చంద్రబాబు దూరదృష్టితో నిర్మించిన పట్టిసీమే కారణమని సీమ ప్రాంత ప్రజాప్రతినిధులు అభివర్ణించారు. సీఎం ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశతో తమ ప్రాంత వాసుల్లో ఆనందంతో ఉన్నారని ఉమ్మడి ప్రకాశం ఎమ్మెల్యేలు, నేతలు ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్
పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు
వంగవీటి రాధాను పాస్‌పోర్ట్ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News