Share News

అసైన్డ్ భూముల కేసు.. సీఎం చంద్రబాబుకు సుప్రీంలో బిగ్ రిలీఫ్

ABN , Publish Date - Aug 14 , 2026 | 01:02 PM

అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

అసైన్డ్ భూముల కేసు.. సీఎం చంద్రబాబుకు సుప్రీంలో బిగ్ రిలీఫ్
AP CM Chandrababu Naidu

ఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), మంత్రి నారాయణలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి తగిన కారణాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.


రాజకీయ కక్షసాధింపుతోనే ఈ కేసు నమోదు చేశారనే ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం పునరుద్ఘాటించింది. రాజధాని ల్యాండ్ పూలింగ్, జీఓల జారీ పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలని.. ఏ ఒక్క బాధితుడూ కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వేసిన పిటిషన్లకు చట్టబద్ధత ఉండదనే హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. న్యాయస్థానాలను రాజకీయ కక్షసాధింపులకు వేదికగా మార్చవద్దని హితవు పలికింది. వైసీపీ హయాంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల విచారణను సుప్రీంకోర్టు ముగించింది.


వార్తలు కూడా చదవండి...

సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు

వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్

సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 01:16 PM