స్థానిక ఎన్నికలు.. సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:38 PM
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ గడువును పెంచాలన్న వైసీపీ అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఎన్నికలపై వైసీప పిటిషన్‌పై విచారణను ముగించింది.
ఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో (Supreme Court) వైసీపీకి (YSRCP) ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ గడువును పెంచాలన్న వైసీపీ అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఎన్నికలపై వైసీపీ పిటిషన్‌పై విచారణను ముగించింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము పాటించామని ఏపీ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నామినేషన్ల సమయం ముగిసినందున ‘ఇక ఎన్నికల్లో పోటీచేయాలి.. ఆల్ ది బెస్ట్’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించా రు.
ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఆ ఫుటేజ్‌ను కూడా భద్రపరచాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్లు వేయడానికి ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వట్లేదని వైసీపీ తరపు న్యాయవాది మణిందర్ సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నివేదించింది. ఎన్నికల కమిషన్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News