Share News

అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 26 , 2026 | 03:56 PM

అర్నబ్ తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.

అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
AP CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు. అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు (సోమవారం) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, ఆర్టీజీఎస్ సహా విపత్తు నిర్వహణ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.


తుఫాన్ ప్రభావానికి అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావంతో కురిసే వర్షాలు, గాలుల వరద ప్రవాహాల తీవ్రతను అంచనా వేస్తూ తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గతంలో వచ్చిన తుఫాన్‌ల సమాచారాన్ని విశ్లేషిస్తూ రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. తీరప్రాంతాల ప్రజలను సహాయక షెల్టర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu

‘అర్నబ్’ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. అక్టోబరు 28వ తేదీన బాపట్ల - విశాఖపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు.. గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని చెప్పుకొచ్చారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని.. రైతులు పంటల సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంటల కంటే ప్రాణరక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 04:38 PM