Share News

ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:39 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం అందించింది. ఏపీలో రూ. 27,370 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భారీ విద్యుత్ ప్రసార ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం
Central Government

ఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీ సాయం అందించింది. ఏపీలో రూ.27,370 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భారీ విద్యుత్ ప్రసార ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడమే లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదించింది. ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ ఊతమిచ్చింది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని విస్తరించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ (GEC-III) కింద ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.


రాష్ట్రవ్యాప్తంగా 7,872 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, రామాయపట్నం, కొప్పాకలలో కొత్తగా 400 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో విద్యుత్ ప్రసార వ్యవస్థ ఆధునికీకరణకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. రూ. 27,370 కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఆమోదించింది. 9,500 MVA సామర్థ్యంతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం జరగనుంది. 2029-30 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళికలను కేంద్రం రచించింది. ఏపీలోని పోర్టు ప్రాంతాలు, పారిశ్రామిక క్లస్టర్లకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రామాయపట్నంలో 400 kV సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:46 PM