దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు.. జగన్ అండ్ కో పై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం
ABN , Publish Date - Feb 21 , 2026 | 07:15 PM
శాసనమండలిలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని పట్టుకున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకొని చాలా అభ్యంతరకరంగా వ్యవహరించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
విశాఖపట్నం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని పట్టుకున్న సమయంలో.. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకొని చాలా అభ్యంతరకరంగా వ్యవహరించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి (Srinivasananda Saraswati) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన నిరసనపైన తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని అన్నారు. నాయకులుగా మీరే తప్పు చేస్తే సమాజానికి ఏం సందేశం ఇస్తారని ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలి..
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని గతంలో చెప్పామని.. ఈ విషయంలో చాలాసార్లు హిందూ సంఘాలుగా ఖండించామని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. ఎమ్మెల్సీలు వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని, ప్రాయశ్చిత్తంతో చెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ నాయకులు కూడా ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. వైసీపీ హయాంలో ఆలయాల మీద దాడులు చేశారని ధ్వజమెత్తారు. హిందూ సమాజాన్ని చాలా బాధపెట్టారని.. అనేకసార్లు వెక్కిరిస్తూ కూడా నేతలు మాట్లాడారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
లడ్డూ ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు..
తిరుమలలో లడ్డూ ప్రసాదాన్ని సైతం భ్రష్టు పట్టించారని శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. ఇప్పటికీ వైసీపీ నేతలు ఇలాంటి రాద్ధాంతాలు చేయడం తగదని అన్నారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. విజయవాడలో త్వరలోనే సాధువులతో సమావేశం నిర్వహిస్తామని.. ఈ సమావేశంలో ఆలయాల్లో జరిగిన అపచారాలు, దాడులపై చర్చిస్తామని వివరించారు. ఇలాంటి దుశ్చర్యలపై వైసీపీ నేతలకు హిందూ సమాజం బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
హిందువులంటే విశ్వాసం లేదు..
జగన్ మోహన్ రెడ్డికి హిందువులంటే విశ్వాసం లేదని శ్రీనివాసానంద సరస్వతి దుయ్యబట్టారు. వైసీపీ నేతలకు కూడా హిందూమతం అంటే విశ్వాసం లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ చెప్పారని వైసీపీ నేతలు అలా చేయడం చాలా పెద్ద తప్పని మండిపడ్డారు. జగన్ రెడ్డికి హిందూమతం గురించి తెలియకపోతే వైసీపీ నేతలతో వేంకటేశ్వరస్వామికి, హిందూ సమాజానికి వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలు వేయించాలని శ్రీనివాసానంద సరస్వతి హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News