లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే పుల్లారావు
ABN , Publish Date - Jun 07 , 2026 | 03:20 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పల్నాడు జిల్లా, జూన్7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pullarao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (ఆదివారం) చిలకలూరిపేట మండలం పసుమర్రులో రూ.20 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహారీలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
లోకేశ్ పనితీరుతో ఏపీ విద్యాశాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు. మౌలిక వసతులు మొదలు.. మెరుగైన ఫలితాల వరకు ప్రతి దానిలో లోకేశ్ మార్క్ పనితీరు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. పది ఫలితాలతో పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభ, తెలివితేటలను దేశానికి లోకేశ్ పరిచయం చేశారని ప్రశంసించారు. రాష్ట్ర విద్యారంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని లోకేశ్ ప్రపంచం గర్వించే స్థాయిలో నిలిపారని కొనియాడారు. లోకేశ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే డీఎస్సీలో అక్రమాలని జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News