Share News

అమరావతి చెస్ అకాడమీ ఏర్పాటుకు మంత్రి లోకేశ్ హామీ.. కోనేరు హంపితో భేటీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 03:14 PM

ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, ఆమె తండ్రి అశోక్.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లి నివాసంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై లోకేశ్‌తో వారు చర్చించారు.

అమరావతి చెస్ అకాడమీ ఏర్పాటుకు మంత్రి లోకేశ్ హామీ.. కోనేరు హంపితో భేటీ
AP Minister Nara Lokesh

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి (Koneru Humpy), ఆమె తండ్రి అశోక్.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను (AP Minister Nara Lokesh) ఉండవల్లి నివాసంలో ఈరోజు (శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై లోకేశ్‌తో వారు చర్చించారు. అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు సహకరించాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.


అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్దతుగా నిలవాలని కోనేరు హంపి చేసిన విజ్ఞప్తి పట్ల మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. తమ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్-2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం, వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి బోర్డు-1లో కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హంపికు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ను మరింత ఉన్నతస్థాయికి మోదీ తీసుకెళ్తున్నారు: లోకేశ్

భోగాపురంతో ఉత్తరాంధ్ర మినీ ఎకనామిక్ సిటీగా మారుతుంది: రామ్మోహన్

హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 04:35 PM