Share News

మెడికో ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు: డీజీపీ

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:59 PM

రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలు 'ఇన్వెస్టిగేషన్‌కు బ్యాక్ బోన్ లాంటివని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.

మెడికో ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు: డీజీపీ
AP DGP Harish Kumar Gupta

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలు 'ఇన్వెస్టిగేషన్‌కు బ్యాక్ బోన్ లాంటివని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. 2024 తర్వాత రాష్ట్రంలో ల్యాబ్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టి రీజినల్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) రాజమహేంద్రవరంలో డీజీపీ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికో ప్రియాంక మృతి ఘటన చాలా బాధాకరమని అన్నారు. మెడికో మృతికి కారకులైన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరులో రూ.253 కోట్లతో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తుళ్లూరులో దేశంలో ఎక్కడా లేని రీతిలో అతి పెద్ద ల్యాబ్ నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. తుళ్లూరులో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ల్యాబ్ నిర్మిస్తామని పేర్కొన్నారు.


RFSL ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం..

‘తిరుపతి , అనంతపూరం, రాజమహేంద్రవరంలో RFSL ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. కర్నూలు , గుంటూరు ,విజయవాడ, విశాఖపట్నంలోనూ RFSL ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. రాజమహేంద్రవరానికి ఏడాదికి 2500 కేసులు వస్తాయని.. వీటన్నింటికీ వేగంగా రిపోర్టులు ఇస్తాం. ప్రస్తుతం ఏడు రోజుల్లో డీఎన్ఏ రిపోర్టు ఇస్తున్నాం. క్రిటికల్ కేసుల్లో 13 గంటల్లో రిపోర్టు ఇస్తున్నాం. బ్లడ్ గ్రూప్స్, డ్రగ్స్, రిపోర్టులను వేగంగా ఇచ్చేందుకు RFSL ల్యాబ్‌ల్లో అధునాతన ఏర్పాట్లు చేశాం. అన్ని ల్యాబ్‌ల్లో సైబర్ ఫోరెన్సిక్ టూల్స్ ఇచ్చి రిపోర్టులు వేగంగా ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రస్థాయిలో నేరుగా పర్యవేక్షించేలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని డీజీపీ తెలిపారు.


జిల్లా స్థాయిలో 'క్లిక్' సెంటర్లు ఏర్పాటు చేస్తాం..

‘1930 నంబర్‌కి ఫిర్యాదు చేస్తే సైబర్ క్రైం ఫిర్యాదుల స్వీకరణ, సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. సైబర్ నేరాల సత్వర పరిష్కారానికి జిల్లా స్థాయిలో 'క్లిక్' పేరుతో సెంటర్లు ఏర్పాటు చేస్తాం. గోదావరి పుష్కరాల్లో అధునాతన డ్రోన్లు, సీసీటీవీ సహా అన్ని సాంకేతిక సదుపాయాలతో క్రౌడ్ కంట్రోల్ చేస్తాం. రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆయా ఘాట్లలో ఎక్కడ రద్దీ లేకుండా ఉండేలా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని సీసీటీవీ కెమెరాలకు రికార్డింగ్ మోడ్‌ను అమలు చేస్తాం. రాష్ట్రంలో లవ్ జిహాద్‌పై ఆరోపణలు వచ్చాయని.. ఎక్కడా నిరుపణ కాలేదు’ అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 03:53 PM