ఆర్నబ్ తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:19 PM
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావంపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. తుఫాన్ ప్రభావంపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు (మంగళవారం) ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని వివిధ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. వివిధ జిల్లాల్లో ఆర్నబ్ తుఫాన్ చూపనున్న ప్రభావం, భారీ వర్షాల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రస్తుత పరిస్థితి, ముందస్తు సన్నద్ధతా చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కాకినాడ సమీపంలోని యానాంకు 167 కిలోమీటర్ల దూరంలో ఆర్నబ్ తుఫాన్ కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..
గడచిన ఆరు గంటలుగా యానం తీరం వైపుగా 23 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోందని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలి..
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వీలైనంత త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈదురు గాలుల కారణంగా పడిపోయిన చెట్లు, హోర్డింగులతో రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని మార్గనిర్దేశం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News