Share News

వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం.. నివాళులు అర్పించిన చంద్రబాబు, పవన్, లోకేశ్

ABN , Publish Date - Aug 16 , 2026 | 09:54 AM

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సర్మించుకున్నారు.

వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం.. నివాళులు అర్పించిన చంద్రబాబు, పవన్, లోకేశ్
Atal Bihari Vajpayee Death Anniversary

అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సర్మించుకున్నారు. వాజ్‌పేయి సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

దేశ సేవకు వాజ్‌పేయి జీవితాన్ని అంకితం చేశారు: సీఎం చంద్రబాబు

దేశభక్తి, దూరదృష్టి, సమ్మిళితత్వానికి వాజ్‌పేయి ప్రతీక అని సీఎం చంద్రబాబు కొనియాడారు. 'దేశమే ప్రథమం' అనే స్ఫూర్తితో తన జీవితమంతా దేశ సేవకోసం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్‌పేయి అందించిన మద్దతు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


చరిత్రను మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి: పవన్ కల్యాణ్

భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలిపారు. చర్రితను మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


దేశ ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల పురోగతిలో వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారు: లోకేశ్

అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల పురోగతిలో వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని తెలిపారు. వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా, ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుందామని నారా లోకేశ్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 11:15 AM