Share News

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం 

ABN , Publish Date - Aug 14 , 2026 | 08:30 AM

తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదంతో రైతు మునిరాజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం 
Tirupati Farmer Muniraja Case

తిరుపతి జిల్లా, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదంతో రైతు మునిరాజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మునిరాజాది బుచ్చినాయుడు కండ్రిగ మండలం వేణుగోపాలపురం. తండ్రి ఆస్తిని తన తమ్ముడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు.


ఈ క్రమంలోనే అధికారులను నిలదీయడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మునిరాజా వచ్చాడు. ఈ ఆఫీసులోనే మనస్తాపంతో ఆయన గడ్డి మందు తాగడంతో అపస్మారక స్థితిలో కుప్పకూలాడు. ఆ రైతుకు శ్రీకాళహస్తి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం సిమ్స్‌కు తరలించారు. రైతు మునిరాజా పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వార్తలు కూడా చదవండి...

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు

జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 09:10 AM