ఏపీ స్థానిక ఎన్నికల్లో ప్రచార ఖర్చులపై ఈసీ కీలక మార్గదర్శకాలు
ABN , Publish Date - Oct 26 , 2026 | 08:22 PM
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార ఖర్చులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనల్లో అభ్యర్థి పేరు లేదా ఫొటో ఉంటే ఆ ఖర్చు పూర్తిగా అభ్యర్థిదేనని స్పష్టం చేశారు.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార ఖర్చులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనల్లో అభ్యర్థి పేరు లేదా ఫొటో ఉంటే ఆ ఖర్చు పూర్తిగా అభ్యర్థిదేనని స్పష్టం చేశారు. అభ్యర్థి ప్రస్తావన లేకుండా, కేవలం పార్టీ నేతల ఫొటోలతో ఇచ్చే సాధారణ ప్రకటనల ఖర్చు రాజకీయ పార్టీల ఖాతాలోకే జమ చేస్తామని తెలిపారు.
పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు తదితర ప్రచార సామగ్రిపై అభ్యర్థి ప్రస్తావన ఉంటే అది అభ్యర్థి ఎన్నికల ఖర్చు కిందే లెక్కకు వస్తుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అభ్యర్థి పేరు లేకుండా పార్టీల నేతల ఫొటోలు మాత్రమే ఉన్న ప్రచార సామగ్రి ఖర్చును కూడా పార్టీల ఖాతాలోకే వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. సాధారణ ప్రచారానికి పార్టీ నేతలకు కేటాయించిన వాహనాల్లో అభ్యర్థి కూడా పాల్గొంటే, ఆ వాహన ఖర్చును అభ్యర్థి ఖర్చుల జాబితాలోనే లెక్కిస్తామని చెప్పుకొచ్చారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలకు (స్టార్ క్యాంపెయినర్లకు) సాధారణ ప్రచారం కోసం ఆయా నిబంధనల ప్రకారం వాహన పాసులను మంజూరు చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం
జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!
రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News