వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. అసెంబ్లీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:17 PM
హిందూ మతాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ.. హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సమావేశానికి మూడు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైసీపీ నేతలు చేసే విధ్వంస కుట్రలను సమావేశంలో డిప్యూటీ సీఎం లేవనెత్తారు. మన ప్రభుత్వంపై జగన్ అండ్ కో చేసే కుట్రలపై మూడు పార్టీల సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పవన్ దిశానిర్దేశం చేశారు.
సభ్యులు కీలక అంశాలు ప్రస్తావించాలి: మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ అసెంబ్లీలో సభ్యులు ఎంతసేపు మాట్లాడామనే దానికంటే గురించి ఏం మాట్లాడమనేది ముఖ్యమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను కలిశారని ప్రస్తావించారు. ఆయన కలిసే ప్రతీ సంస్థ గురించి ముందస్తు సమాచారం సేకరించి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడేవారని గుర్తుచేశారు. దావోస్ పర్యటనలో పలువురు పారిశ్రామిక వేత్తలతో జరిగిన భేటీలో ఆ సంస్థకు మన ప్రభుత్వ పరంగా కావాల్సినవి ఏమిటి? మనకు ఉన్న వనరులేమిటనే విషయంపై సూటిగా చెప్పి.. ప్రతి సమావేశాన్ని నిమిషాల వ్యవధిలో చంద్రబాబు ముగించారని ప్రస్తావించారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామిక వేత్తలను కలిసేందుకు వీలైందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో సభ్యులు కూడా ముఖ్యమంత్రి స్పూర్తితో.. తక్కువ సమయంలో కీలక అంశాల గురించి ప్రస్తావించాలని మంత్రి పయ్యావుల కేశవ్ మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..
మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ.!
Read Latest Telangana News And AP News And Telugu News