ఆ గ్రామాల్లో స్థానిక ఎన్నికలను పెండింగ్‌లో పెడుతున్నాం: మంత్రి నారాయణ
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:28 PM
అమరావతి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ల్యాండ్ పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో ప్రస్తుతానికి స్థానిక ఎన్నికలను పెండింగ్‌లో పెడుతున్నామని ప్రకటించారు.
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) పేర్కొన్నారు. ల్యాండ్ పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో ప్రస్తుతానికి స్థానిక ఎన్నికలను పెండింగ్‌లో పెడుతున్నామని ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను ఈరోజు (శనివారం) పరిశీలించారు. ఈ పనులపై CRDA, ADCL ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణ పనులపై కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి నారాయణ టార్గెట్ పెట్టారు. ప్రతి నిర్మాణ సంస్థకు పనులు పూర్తి చేయంపై టార్గెట్లు నిర్దేశించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అమరావతి నిర్మాణ పనులకు కొంత అంతరాయం..
వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు కొంత అంతరాయం కలిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని చెప్పుకొచ్చారు. ప్రతి రెండు నెలలకు 6 అంతస్తుల నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ఐకానిక్ అసెంబ్లీ, హై కోర్టు ఫౌండేషన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భవనాలు దాదాపు అయిపోయాయని అన్నారు. నవంబర్ 11వ తేదీ తర్వాత నుంచి ప్రారంభోత్సవాలు మొదలు పెడతామని చెప్పారు. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లే అవుట్ రోడ్లు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.
రాజధానిపై కొంతమంది అవాకులు, చవాకులు పేలుతున్నారు..
రాజధానిపై కొంతమంది అవాకులు, చవాకులు పేలుతున్నారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. విమర్శలు చేసే వారు అమరావతికి వచ్చి చూస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటో కనిపిస్తాయని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం 35 వేల మంది కార్మికులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం 2028 అక్టోబరు నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ కోసం మూడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చాలా వరకు పూర్తయిందని తెలిపారు. 75శాతానికి పైగా ల్యాండ్ పూలింగ్ వచ్చేనెలాఖరుకు పూర్తవుతుందని వివరించారు. డిసెంబర్ నాటికి రోడ్ నెట్‌వర్క్‌పై సింగపూర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుందని వెల్లడించారు. అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా సమాంతరంగా ఉండే రోడ్డును డిజైన్ చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News